Allu Aravind - K Raghavendra Rao -  Daggubati Suresh Babu in Unstopabble with NBK 2: నందమూరి బాలకృష్ణ హోస్ట్ గా వ్యవహరిస్తున్న అన్ స్టాపబుల్ విత్ ఎన్బికె సీజన్ 2 ప్రస్తుతం టెలికాస్ట్ అవుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే కొన్ని ఎపిసోడ్లూజ్ రిలీజ్ అవ్వగా ఆ ఎపిసోడ్స్ అన్నీ ఆసక్తికరంగా మారాయి. చివరిగా రిలీజ్ అయిన ఎపిసోడ్ లో నందమూరి బాలకృష్ణతో కలిసి డిగ్రీ చదువుకున్న మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, మాజీ స్పీకర్ ప్రస్తుత ఎమ్మెల్సీ సురేష్ రెడ్డి అలాగే బాలకృష్ణతో స్కూల్ ఏజ్ లో చదువుకున్న రాధిక కనిపించి అలరించారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఇక ఇప్పుడు తాజాగా మరో ఆసక్తికరమైన విషయం తెర మీదకు వచ్చింది. అదేమిటంటే నందమూరి బాలకృష్ణ అన్ స్టాపబుల్ విత్ ఎన్.బి.కె నెక్స్ట్ ఎపిసోడ్ కోసం ఆహా వ్యవస్థాపకుల్లో ఒకరైన అల్లు అరవింద్ తెలుగు సినీ దర్శకులలో మేటిగా చెప్పుకునే కె రాఘవేంద్రరావు తెలుగులో టాప్ ప్రొడ్యూసర్స్ లో ఒకరైన దగ్గుబాటి సురేష్ బాబు హాజరు కాబోతున్నారు అని తెలుస్తోంది. తెలుగు సినీ నిర్మాణ రంగం గురించి వారిని పలు ఆసక్తికరమైన ప్రశ్నలు సంధించే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది.


అయితే మరో పక్క కె నటుడు, దర్శకుడు కే విశ్వనాధ్ ని కూడా ఈ షోకి తీసుకురావాలని అనేక రకాలైన ప్రయత్నాలు గట్టిగా జరుగుతున్నట్లు తెలుస్తోంది. అయితే ఆయన ఆరోగ్య రీత్యా ఆయన నేరుగా స్టూడియోకి రాలేరు కాబట్టి ఇంటి దగ్గరికి వెళ్లి షూట్ చేసుకునే రావడమా లేక వీడియో కాన్ఫరెన్స్ లాగా ఒక ఎపిసోడ్ షూట్ చేయాలా? అనే విషయం మీద చర్చలు జరుపుతున్నట్లుగా తెలుస్తోంది అయితే విశ్వనాథ్ కి సపరేట్ ఎపిసోడ్ ఉంటుందా లేక అల్లు అరవింద్-దగ్గుబాటి సురేష్ బాబు కనిపించిన ఎపిసోడ్ లోనే కె విశ్వనాథ్ కూడా కనిపించబోతున్నారా? అనే విషయం మీద ప్రస్తుతానికైతే క్లారిటీ లేదు.


ఇక అన్ స్టాప్ ఫుల్ విత్ ఎన్బికె ఎపిసోడ్స్ అన్ని కూడా ఆసక్తికరంగా సాగుతున్న నేపథ్యంలో ప్రతి ఎపిసోడ్ ని చాలా స్పెషల్ కేర్ తీసుకుని రూపొందించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. అందులో భాగంగానే రాబోతున్న ఎపిసోడ్స్ కూడా మరింత గ్రాండ్ గా ప్లాన్ చేస్తున్నారు. ఇక చిరంజీవి కూడా ఈ సీజన్లో కనిపించే అవకాశం ఉందని ప్రచారం జరుగుతుండగా పవన్ కళ్యాణ్, త్రివిక్రమ్ కలిసి ఒక ఎపిసోడ్లో కనిపించే అవకాశం ఉందని కూడా తెలుస్తోంది. చూడాలి మరి అది ఎంతవరకు కరెక్ట్ అవుతుంది అనేది.


Also Read: Minister Roja: కబడ్డీ ఆడిన మంత్రి రోజా.. ఒక్కసారిగా మీదపడ్డ విద్యార్థులు! వైరల్ వీడియో  


Also Read: Naga Babu Daughter : నిహారిక కోసం అబద్దాలు చెబుతున్న నాగబాబు.. మెగా బ్రదర్ పోస్ట్ వైరల్



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook